Episodes
Tuesday Sep 12, 2023
Indian Nationalist Bina Das | బెంగాలీ అగ్నికన్య , విప్లవవనిత బీనా దాస్
Tuesday Sep 12, 2023
Tuesday Sep 12, 2023
Bina Das (24 August 1911—1986) was an Indian revolutionary and nationalist from West Bengal. Highly inspiring life of Bina Das explained in a very interesting manner by KiranPrabha.
1932 ఫిబ్రవరి 6 - కలకత్తా యూనివర్సిటీ స్నాతకోత్సవం జరుగుతోంది. అందులో డిగ్రీ పట్టా తీసుకోవల్సిన ఓ 20 సంవత్సరాల యువతి, ఆ కార్యక్రమానికి హాజరైన ఆంగ్లేయుడు బెంగాల్ గవర్నర్ పై అతి సమీపం నుంచి బుల్లెట్ల వర్షం కురిపించింది. ఐదు బుల్లెట్లూ
గురితప్పడంతో గవర్నర్ కి ఏమీ కాలేదు. ఆ యువతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచినప్పుడు ఆమె చేసిన ప్రకటన " నాకు మా అమ్మా, నాన్నా అంటే ఇష్టం, నా తోబుట్టువులంటే ఇష్టం, నేను చదువుకునే కాలేజీ అంటే ఇష్టం, నాకు చదువు చెప్పే గురువులంటే ఇష్టం .. - వీటన్నింటికీ మించి, వీరందరికీ మించి నాకు నాదేశమంటే ఎంతో ఇష్టం. నా దేశమాతను చెరబట్టిన ఆంగ్లేయులకు మా సత్తా ఏమిటో చూపించాలనుకున్నా ..అందుకే గవర్నర్ కి గురిపెట్టాను. ఈ క్రమంలో నా ప్రాణాలు పోయినా లెక్కెచెయ్యను..". ఆ యువతి పేరు బీనా దాస్. ఛాత్రి సంఘ అనే రహస్య విప్లవ సంస్థలో సభ్యురాలైన కళాశాల విద్యార్థిని. బీనాదాస్ చరిత్రకెక్కని చరితార్థురాలు, బెంగాలీ అగ్నికన్య, విప్లవ వనిత..! భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చాలా తక్కువసార్లు కనిపించే పేరు బీనా దాస్.! ఎంతో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన బీనా దాస్ జీవన రేఖలు ఈ ఎపిసోడ్ లో వినండి. అరుదైన సమాచారం..!! జీవిత చరమాంకంలో బీనా దాస్ , ఋషికేశ్ లోని ఓ బస్టాండులో అనామకంగా చనిపోవడం అత్యంత విషాదం..దారుణం కూడా..!!
Version: 20241125
Comments (0)
To leave or reply to comments, please download free Podbean or
No Comments
To leave or reply to comments,
please download free Podbean App.