Episodes
Tuesday Nov 15, 2022
Tuesday Nov 15, 2022
#kiranprabha #telugu #kommuri
అలనాటి సుప్రసిద్ధ కథా, నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాలరావుగారు 1957 లో వ్రాసిన కథ 'క్షమించాను '. 65 సంవత్సరాల క్రిందట తన 22 సంవత్సరాల వయసులో కొమ్మూరి వేణుగోపాలరావు గారు వ్రాసిన మానసిక విశ్లేషణ అంతర్లీనంగా సాగే కథ ఇది. 35 సంవత్సరాలు కాపురం చేసిన ఓ జంట, ఆమె మరణశయ్య మీద ఉండగా అన్నేళ్ళూ తన మనసులో దాచుకున్న భావాల్ని భర్తకు చెప్పేసింది. అన్నేళ్ళు ఆయన కౄరత్వన్ని భరిస్తూ, ఆయనకు తెలీకుండానే ఆయన్ని క్షమిస్తూ జీవించానని చెప్పింది, ఆయనకదో షాక్..!! ఎలాగూ చనిపోతాను కదా అని అంత ధైర్యంగా చెప్పేసింది.. కానీ.. తర్వాతేం జరిగింది? కొమ్మూరి వేణుగోపాలరావుగారి కథకు కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ. మనసుల్ని కదిలించే కథ, మనసుల్ని కలవరపరిచే కథ కూడా. చదవడానికి లింక్ ఇదీః https://drive.google.com/file/d/1XBoIuqBmu9GsgHs_8164FzljRPHvPEVF/view
Comments (2)
To leave or reply to comments, please download free Podbean or
Beerbiceps
Sunday May 21, 2023
మీరు వివరించే విధానం ఓదార్పు మరియు తేలికపాటి అనుభూతిని కలిగిస్తుంది
Monday Nov 28, 2022
To leave or reply to comments,
please download free Podbean App.